Wednesday, January 22, 2025

కిటికిట లాడుతున్న బస్టేషన్లు, రైల్వే స్టేషన్‌లు

- Advertisement -
- Advertisement -

passenger traffic Increased at bus stations and railway stations

హైదరాబాద్: నగరంలోని బస్టేషన్లు, రైల్వేస్టేషన్లు విద్యార్థులతో శుక్రవారం కిక్కిరిసి పోయాయి. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణ చర్యల్లో భాంగా ముందుస్తుగానే పాఠశాలలకు, విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను ప్రకటించడంతో వారంతా సొంతూళ్ళకు పయనం అయ్యారు. విద్యా సంస్థలతో పాటు ఉస్మానియా యూనివర్శిటి క్యాంపస్‌లోని హస్టళ్ళను కూడా మూసివేస్తున్నామని ప్రకటించడంతో జేబిఎస్, జిబిఎస్,దిల్‌షుక్‌నగర్ వంటి ప్రధాన బస్టేషన్లే కాకుండా సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్ల కూడా ప్రయాణికులతో నిండిపోయాయి. ముఖ్యంగా రైల్వేస్టేన్‌లలో సొంతూళ్ళకు బయలుదేరేవారిలో తెలంగాణ విద్యార్థులకంటే ఏపికి వెళ్ళేవారే అధికంగా ఉండటంతో ట్రైన్ టికెట్ కోసం గంటల కొద్ది కౌంటర్ల వద్ద చేచి చూడాల్సి వచ్చంది. రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లలో రద్దీని చూస్తుంటే సంక్రాంతి పండగ ముందే వచ్చినట్లనిపించింది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఎపిఎస్‌ఆర్‌టిసిలో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తామని ప్రకటించడమే కాకుండా ఆయాబస్సుల్లో ఇప్పటికే రిజర్వేషన్ పూర్తి కావడంతో పెద్ద ఎత్తున టిఆర్‌ఎస్‌బస్సులను ఆశ్రయించారు.

అంతే కాకుండా రైల్వేస్టేషన్‌లలో టికెట్ లభించిన వారు సైతం బస్సులో వెళ్ళేందుకు మెగ్గు చూపడంతో బస్టేషన్లు ప్రయాణికులతో నిండిపోయాయి.ప్రయాణికులు రద్దీని తట్టుకునేందుకు తాము అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్‌టిసి అధికారుల చెబుతున్నారు. ప్రయాణికులకు ఎటువంటి సమస్యలు లేకుండా అదనపు బస్సులను కూడా సిద్దం చేశామన్నారు. వ్యక్తిగత వాహనాలకు ప్రాధాన్యం ః ప్రస్తుతం కరోనా కేసులు అధికం కావడంతో కొంత మంది ప్రయాణికులు వ్యక్తిగత వాహనాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో బస్టేషన్లు, రైల్వేస్టేషన్లలో కోవిడ్ నిబంధనలు సాధ్యం కావని అందుకే తాము ముందు జాగ్రత్త చర్యల్లో భాంగా వ్యక్తిగత వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.బస్సులు, రైల్వే చార్జీలతో పోలిస్తే ఆర్దిక భారమైనప్పటికి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత, లేదా ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చిందంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News