Wednesday, January 22, 2025

ట్రక్కును ఢీకొట్టిన రైలు: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

 

న్యూయార్క్: ట్రక్కును రైలు ఢీకొట్టిన సంఘటన అమెరికాలోని మిస్సోరిలో సోమవారం అర్థరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ట్రక్కు రైలు గేటు దాటుతుండగా రైలు ఢీకొనడంతో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా 50మంది వరకు గాయపడ్డారు. ఎనిమిది బోగీలు, రెండు ఇంజన్లు పట్టాలు తప్పాయని స్థానిక మీడియా పేర్కొంది. క్రాసింగ్ వద్ద ఎలాంటి గేట్లు లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వాపోతున్నారు. 243 మంది ప్రయాణికులతో రైలు లాస్ ఎంజిల్స్ నుంచి చికాగో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News