ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సింధూ నదిలో ఓ వ్యాన్ పడిపోయింది. ఈ దుర్ఘటనలో కనీసం 17 మంది మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ వాహనం ఖైబర్-పుఖ్తుంఖ్యా రాష్ట్రంలో చిలాస్ నుండి రావల్పిండి వైపు వెళుతుండగా కోహిస్తాన్ జిల్లాలోని పానిబా ప్రాంతంలో సింధు నదిలో పడిపోయిందని అధికారులు తెలిపారు. టూర్ కోసం కుటుంబసభ్యులు అద్దెకు తీసుకున్న వ్యాన్‌లో డ్రైవర్‌తో సహా పదిహేడు మంది ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. దేశంలోని ఉత్తర ప్రాంతాలను కలిపే రహదారులు అత్యంత ప్రమాదకరమైన పర్వతాల గుండా వెళుతుంటాయన్న సంగతి తెలిసిందే. సమాచారం అందుకున్న అధికారులు సహాయ చర్యలను ముమ్మరం చేశారు. తప్పిపోయిన ప్రయాణికులను గుర్తించడానికి సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి.
Passenger van falls into river in Pakistan