Sunday, February 23, 2025

విమానంలో ప్రయాణికుడి రక్తపు వాంతులు

- Advertisement -
- Advertisement -

నాగపూర్: ఒక ప్రయాణికుడికి అత్యవసరంగా వైద్య సహాయం అవసరం కావడంతో ముంబై నుంచి రాంచి వెళుతున్న ఇండిగో విమానాన్ని సోమవారం సాయంత్రం నాగపూర్ ఎయిర్‌పోర్టుకు మళ్లించాల్సి వచ్చింది.

తీవ్ర కిడ్నీ వ్యాధి(సికెడి), క్షయ వ్యాధితో బాధపడుతున్న ఒక 62 ఏళ్ల ప్రయాణికుడు విమానంలోనే రక్తపు వాంతులు చేసుకున్నట్లు కిమ్స్ ఆసుపత్రి డిజిఎం ఏజజ్ షమీ తెలిపారు. కిమ్స్ ఆసుపత్రికి చేరుకునే సమయానికే ఆ ప్రయాణికుడు మరణించారని ఆయన చెప్పారు. తదుపరి ప్రక్రియల నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News