Wednesday, January 22, 2025

క్యాబ్ డ్రైవర్ల నిలువు దోపిడి

- Advertisement -
- Advertisement -

Passengers are being exploited by Cab drivers

 

హైదరాబాద్ : విద్యానగర్‌కు చెందిన రవీందర్ తన కుటుంబ సభ్యులతో బడంగపేటలోని శివుని ఆలయం సందర్శించుకునేందుకు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాడు. దర్శనం అనంతరం క్యాబ్ బుక్ చేసుకునేందుకు మరో క్యాబ్ బుక్ చేసుకున్నాడు. రద్దీ సమయం కావడంతో క్యాబ్‌బుక్ అయ్యేందుకు కొంత సమయం పట్టింది. సుమారు 15 నిమిషాలు ప్రయత్నించగా క్యాబ్ బుక్ అయ్యింది.

ఏదో విధంగా క్యాబ్‌బుక్ అయ్యిందని సంతోషించే లోపు సదరు క్యాబ్ డ్రైవర్ ఫోన్ చేశాడు. డ్రాపింగ్ ఎక్కడ అని అడిగాడు… విద్యానగర్ అని చెప్పడంతో ఫోన్ పెట్టేశాడు. సమారు గంట గడిచినా సదరు డ్రైవర్ నుంచి ఎటుంటి సమాచారం రాలేదు. దాంతో మరో క్యాబ్ బుక్ చేశాడు. దాంతో క్యాబ్‌డ్రైవర్ రూ.1000 డిమాండ్ చేశాడు. బుకింగ్ రద్దు చేసుకుంటే వస్తా అన్నాడు. దాంతో గత్యతరం లేక బుకింగ్‌ను క్యాన్సిల్ చేసుకోవాల్సివచ్చింది. ఇది కేవలం ఒక్క రవీందర్ సమస్యే కాదు. సాధారణంగా క్యాబ్‌లలో దూర ప్రాంతాలకు ప్రయాణించేవారు కూడా ఎదుర్కొంటున్న సమస్యే. ఈ విధంగా సంబందిత క్యాబ్‌డ్రైవర్లు అదనపు సంపాదన కోసం వేసే ఎత్తుగడకు సాధారణ ప్రయాణికులు బలైపోతున్నారు. సాధారణంగా మనం క్యాబ్‌బుక్ చేసినప్పడు మనకు మనంగా క్యాన్సిల్ చేసుకుంటే అందుకు సంబంధించి సుమారు రూ.50 నుంచి 80వరకు ఫైన్ పడుతుంది.

ఒక వేళ సదరు డ్రైవరే క్యాన్సిల్ చేస్తే తనకు వచ్చే కమిషన్ రాకుండా పోవడమే కాకుండా సదరు సంస్థకు తాను రైడ్ ఎందుకు క్యాన్సిల్ చేయాల్సివచ్చిందో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇటువంటి సమయంలో వారు కస్టమర్లే స్వయంగా రైడ్ క్యాన్సిల్ చేసేలా చేయడంతో సదరు ప్రయాణికులు మరో సారి క్యాబ్ బుక్ చేసినప్పుడు గతంలో రైడ్ క్యాన్సిల్ చేయాల్సిన మొత్తం కూడా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే సదరు క్యాబ్‌డ్రైవర్లు రైడ్ క్యాన్సిల్ చేశామని సమచారం ఇచ్చేందుకు కూడా ఇష్డపడరు. సాధారణంగా ఉదయం,సాయంత్రం సమయాల్లో రద్దీ అధికంగా ఉంటుంది. ఆ సమయంలో క్యాబ్‌లుబుక్ అయ్యేందుకు సాధారణంగా కొంత సమయం పడుతుంది. ఏదో రకంగా వెళ్ళవచ్చులే అనుకునే ప్రయాణికులకు ఈ విధంగా చివరి నిమిషంలో బుకింగ్ క్యాన్సిల్ కావడంతో వారు ఆందోళన చెందుతున్నారు.

క్యాబ్‌ల వల్ల ప్రయాణినాకి భరోసా లభించడం లేదని, సదరుడ్రైవర్‌కు గిట్టుబాటు అవుతుందనుకుంటనే వస్తాడని లేక పోతే ఇటువంటి సమస్యలను వారు సృష్టిస్తారని మౌలాలికి చెందిన మహిళా ప్రయాణికురాలు పశ్యంతి ఆవేదన వ్యక్తం చేశారు. క్యాబ్ డ్రైవర్లపై ఫిర్యాదు చేసేందుకు ఒక ప్రత్యేకమైన విభాగం లేక పోవడంతో వారు ఇష్టవచ్చిన విధంగా ప్రయాణికులను నిలువుదోపిడి చేస్తున్నారని ఆమే ఆరోపించారు. సదరు సంస్థలు డ్రైవర్‌లకు ఇచ్చే కమిషన్‌ను తగ్గించడంతో ఇటువంటి పరిస్థితి ఏర్పడందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సాధారణంగా ప్రతి కిలో మీటర్‌కు కొంత మొత్తాన్ని డ్రైవర్‌ల ఖాతాలో సదరు సంస్థలు జమ చేస్తాయి. కాని ఈ విధంగా కమిషన్ రూపంలో వచ్చే ఆదాయం తమకు ఏ మాత్రం సరిపోక పోవడంతో వారు డైరక్టుగా ప్రయాణికులతో బేరసారాలుదిగుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News