Friday, December 20, 2024

మెట్రోలో సీటు కోసం మహిళల జగడం: పెప్పర్‌స్ప్రేతో దాడి… వైరల్ వీడియో

- Advertisement -
- Advertisement -

 

 

న్యూస్‌డెస్క్: ఢిల్లీ మెట్రోలో జరిగే వింతలు, విచిత్రాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచు దర్శనమిస్తున్నాయి. ఇటీవలే పొట్టి దుస్తులు వేసుకుని ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన ఒక మహిళకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సభ్యతా పాఠాలు బోధించగా ఢిల్లీ మెట్రో రైలులో ఇద్దరు మహిళా ప్రయాణికులు ఘర్షణ పడిన మరో సంఘటనపై ఒక కొత్త వీడియో బయటపడింది. సీటు విషయంలో గొడవ పడిన మహిళ తోటి ప్రయాణికురాలిపై పెప్పర్ స్ప్రే చల్లడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. అనిల్ కుమార్ అనే యూజర్ తన ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియోను షేర్ చేశారు.

ఎరుపు రంగు పంజాబీ డ్రెస్ వేసుకున్న మహిళ తనకు సీటు ఇవ్వలేదంటూ తోటి ప్రయాణికురాలిపై కేకలు వేస్తుండడంతో వీడియో మొదలవుతుంది. చదువుకోవడానికి తనకు ఇబ్బంది అవుతోందంటూ ఎర్ర డ్రెస్ మహిళ ఫిర్యాదు చేస్తుండగా ఇతర ప్రయాణికులు ఆమెకు నచ్చచెప్పడం వినపడుతుంది. ఎర్ర డెస్ మహిళ అరుపులు ఆగకపోవడంతో మరో మహిళ ఎదురు తిరుగుతుంది. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న దశలో ఎర్ర డ్రెస్ మహిళ తన హ్యాండ్ బ్యాగులో నుంచి పెప్పర్ స్ప్రే తీసి ఆమెపై స్ప్రే చేస్తుంది. ఆ ఘాటు వాసనకు రైలు బోగీలో ఉన్న ఇతర ప్రయాణికులు అందరూ దగ్గడం ప్రారంభమవుతుంది. కాగా..ఈ వీడియోపై స్పందించిన ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ ఈ సంఘటన ఎప్పుడు, ఏ కోచ్‌లో జరిగిందో వివరాలు రాయాలని కోరింది. కాగా, సీటు కోసం తోటి ప్రయాణికురాలితో గొడవపడి పెప్పర్ స్ప్రే వాడిన మహిళపై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ మెట్రోను నెటిజన్లు కోరుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News