ఆర్‌టిసి బ్రేక్ డౌన్‌లతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, ట్రాఫిక్ రద్దీలో చిక్కుకుపోతున్న వాహనదారులు
హైదరాబాద్: సుమారు పది నెలల అనంతరం క్రమంగా రోడ్డు మీదకు వస్తున్న ఆర్‌టిసి బస్సులను బ్రేక్ డౌన్ సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. రెండు సవత్సరాల కిత్రం గ్రేటర్ హైదరాబాద్‌లోని 29డిపోల నుంచి3550 బస్సులు ప్రయాణికులకు సేవలు అందించేవి. ఆర్‌టిసి ఉద్యోగుల సమ్మె, కొవిడ్ తదితర కారణాలతో ప్రస్తుతం నగర వ్యాపంగా సుమారు 2250 బస్సులు మాత్రమే ప్రయాణికులకు సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఉన్న బస్సుల్లో అధిక భాగంగా బ్రేక్‌డౌన్ వంటి సమస్యలను ఎదుర్కోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికక్కడే రోడ్లపై చెడిపోయి ఇటు ప్రయాణికులను అటు వాహన చోదకులను సిటీ బస్సు లు భయ బ్రాంతులకు గురి చేస్తున్నాయి.
బస్సు ఎప్పడు ఎక్కడ ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బ్రేక్ డౌన్స్‌ను అధిగమించేందుకు డిపో స్థాయిలో పూర్తి మరమ్మత్తులు చేస్తామని, రోడ్లపై చెడిపోయిన బస్సులకు క్షణాల్లో రిపేర్ చేస్తాం,మోబైల్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న అధికారులు ప్రతిపాదనలు,ప్రణాళికలు కాగితాలకే పరిమితం అయ్యాయి. కాలం చెల్లిన వెయ్యికి పైగా ఉన్న బస్సులు గ్రేటర్ ఆర్టీసికి నష్టాలను తెచ్చిపెడుతున్నాయి.ప్రతి రోజు పదుల సంఖ్యలో బ స్సులు నిలిచిపోతున్నాయి. దీంతో ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభించి పోతుంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్ర వేళల్లో బస్లుల్లో వెళ్ళే ప్రయాణికులే కాకుండా సొంత వాహనాలు, ట్యాక్సీలు ,ఆటోలు వంటి వాటిల్లో వెళ్ళే ప్రయాణికులు సైతం రోడ్లపై నిలిచిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.
బ్రేక్ డౌన్స్ నియంత్రణ కోసం క్షణాల్లో బస్సు వద్దకు చేరుకునే మోబైల్ రిలీఫ్ వాహనాలు, బైక్‌లను ప్రవేశ పెడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. విడిభాగాలు,మెకానిక్‌లతో కూడిన 6 మోబైల్ రిలీఫ్ వాహనాలు ట్రాఫిక్ రద్దీ దారితీసే మెట్రో పనులు జరుగుతున్నా కోఠీ,లక్డికాపూల్ ,ఎల్‌బినగర్, ఈఎస్‌ఐ,లింగంపల్లి, సికింద్రాబాద్ సంగీత్ థియేటర్ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచుతామని గతంలోనే చెప్పిన అధికారులు వాటిని ఏర్పా టు చేసిన దాఖాలు కనిపించడం లేదు. గ్రేటర్‌లో 29 డిపోల నుంచి ప్రతి రోజు 2250 బ స్సులు ప్రయాణికులకు రవాణా సుదపాయా న్ని కల్పిస్తున్నాయి. వీటిలో కాలం చెల్లినవి, సామర్థ్దం లేని,నాణ్యత లేని విడిబాగాల కారణంగా చెడిపోయేవి. రోజుకు 10 నుంచి 15 బస్సులు నగరంలో ఏదో ప్రాంతంలో ఆగిపోతున్నాయి. ఒక బస్సు ఆగిపోతే ఆ రోజు 250 కిలో మీటర్ల రవాణా సుదుపాయం నిలిచిపోయినట్లే. జీత భత్యాలు,ఇంధన భారం, విడిభాగాల కొనుగోళ్ళు వివిధ కారణాల వల్ల రోజుకు కోటిన్నరకు పైగా నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది.
దీంతో ఆక్యుపెన్సీ రేటు కూడా పడిపోతుంది. గతంలో ఎల్‌బినగర్ నుంచి పటాన్ చెరు వరకు వెళ్ళే బస్సు పంజాగుట్ట చౌరస్తాలో చెడిపోయింది. ఎలక్ట్రానిక్ డివైజ్ కంట్రోలర్ చెడిపోయినుట్లగా డ్రైవర్ గుర్తించారు. దాంతో బస్సు అంగుళం కూడా ముందుకు కదల లేని పరిస్థితి నెలకొంది.దీంతో క్షణాల్లో కిలో మీటర్ల దూరం ట్రాఫిక్ నిలిచిపోయింది.దాంతో వాహన దారులు, జనం తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. అత్యంత కష్టంగా దాన్ని అక్కడ నుంచి తొలగించారు. ఈ అంశంపై అధికారులు స్పందించారు. ఆ తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయారు. దాంతో బ్రేక్ డౌన్స్ సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. ఏది ఏమైనప్పటికి అధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Passengers struggling with RTC breakdowns