Friday, December 20, 2024

పారిస్ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు కత్తిపోట్లు

- Advertisement -
- Advertisement -

పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని డె నోర్డ్ రైల్వేస్టేషన్‌లో దుండగుడు ప్రయాణికులపై బుధవారం దాడి చేశాడు. పదునైన ఆయుధంతో ఆరుగురు ప్రయాణికులపై దాడికి పాల్పడ్డాడు. పోలీసులు సత్వరం స్పందించి కాల్పులు జరపడంతో దుండగుడు గాయపడినట్లు ఫ్రాన్స్ మంత్రి తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదన్నారు. ఉదయం బిజీగా ఉన్న సమయంలో దుండగుడు ఓ పోలీస్ అధికారితోపాటు పలువురిపై బ్లేడ్‌వంటి పదునైన ఆయుధంతో దాడి చేశాడని మంత్రి డార్మానిన్ మీడియాకు తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తి పోలీసులు కాల్పుల్లో గాయపడటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం దుండగుడి పరిస్థితి విషమంగా ఉంది.

దాడిచేసిన వ్యక్తి ఉపయోగించిన ఆయుధం కత్తికాదని ఇంటిలో తయారుచేసిన పదునైన ఆయుధమని మంత్రి వివరించారు. దుండగుడు ముందుగా స్టేషన్ బయట ఉన్న వ్యక్తిపైదాడి చేసి 15సార్లు పొడిచి తీవ్రగాయాలపాల్జేశాడు. అనంతరం రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించి పౌరులు, ఓ పోలీస్ అధికారిపై దాడి చేసినట్లు ఫ్రెంచ్ మీడియా నివేదించింది. ప్రయాణికుల అరుపులు విని ఇద్దరు పోలీసులు అక్కడకు చేరుకునేలోపు దుండగుడు మరో పోలీస్ అధికారి వెన్నుపై పొడిచాడు. అయితే ఫ్రాన్స్ బోర్డరు గార్డు అయిన ఆ అధికారికి ్లట్‌ప్రూఫ్ దుస్తులు ధరించి ఉండటంతో స్వల్పంగా గాయమైంది. దాడి ఘటన కారణంగా సేవలకు అంతరాయం కలిగింది. దాడికి కారణం తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News