Friday, December 20, 2024

గాంధీభవన్‌లో మళ్లీ పాసుల లొల్లి

- Advertisement -
- Advertisement -

మహిళా కాంగ్రస్ అధ్యక్షురాలు సునీతారావు అసంతృప్తి

AICC Secretaries Meeting at Gandhi Bhavan

మన తెలంగాణ/హైదరాబాద్ : గాంధీభవన్‌లో మళ్లీ పాసుల లొల్లి మొదలైది. రాహుల్ గాంధీ టూర్, వరంగల్ రైతు సంఘర్షణ సభకు మహిళా విభాగానికి పాసులు ఇవ్వలేదని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా కాంగ్రెస్‌కు బిచ్చం వేసినట్లు పాసులు ఇస్తున్నారని ఆగ్రహం చెందారు. పని చేయని అనుబంధ విభాగాల నేతలకు, పిసిసి నేతలకు వందల పాస్‌లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గతంలో రావిర్యాల, ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభల సమయంలో కూడా పాసుల కోసం లొల్లి జరిగింది. ఇప్పుడు మళ్లీ రాహుల్ టూర్ సమయంలో పాసుల గొడవ చోటు చేసుకోవడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News