Wednesday, January 22, 2025

విద్యార్థి దశ నుంచే క్రీడలపై మక్కువ పెంచుకోవాలి

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు: విద్యార్థి దశ నుంచే విద్యార్థులు క్రీడలపై మక్కువ పెంచుకోవాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ద్వితియ కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో శ్రద్ధ చూపే విధంగా వారి తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. అంతే కాకుండా పాఠశాల ఉపాధ్యాయులకు చేయుత ఇవ్వాలన్నారు. నేటి పోటి ప్రపంచంలో చదువుపై చూపిస్తున్న శ్రద్ధ క్రీడలపై చూపడం లేదన్నారు. క్రీడా రంగంలో సైతం మంచి భవిష్యత్తుందని విద్యార్థులను అటువైపు మల్లే విధంగా తల్లిదండ్రులు చూడాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేసిందన్నారు. పటాన్‌చెరులో మంచి మిని స్టేడియం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా మరిన్ని మినీ స్టేడియాలు ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు విద్యాసంస్థల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News