Tuesday, November 5, 2024

కంప్యూటర్ సైన్స్‌పైనే మక్కువ

- Advertisement -
- Advertisement -

Passionate about computer science

60,941 ఇంజనీరింగ్ సీట్ల
కేటాయింపు ఆప్షన్లు ఇచ్చినా
8,624 మందికి లభించని సీట్లు
31 కాలేజీల్లో 100 శాతం సీట్లు
భర్తీ వర్సిటీల్లో 96.44 శాతం
సీట్ల కేటాయింపు కన్వీనర్
కోటాలో మిగిలిన సీట్లు 13,130 మొదటి దశ ఇంజనీరింగ్ సీట్ల
కేటాయింపు పూర్తి
సెల్ఫ్ రిపోర్టింగ్‌కు ఈ నెల 23 వరకు అవకాశం

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యింది. మొదటి విడతలో 82.27 శాతం సీట్లు కేటాయించారు. రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద మొత్తం 74,071 సీట్లు అందుబాటులోకి ఉండగా, 60941 సీట్ల కేటాయింపు జరిగింది. ఈ ఏడాది మొదటి దశలో 17,101 ఇంజనీరింగ్ సీట్లు ఖాళీగా మిగిలాయి. ఈసారి మొత్తం 175 కాలేజీల్లో 74,071 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా, 60,941 సీట్లు (82.27 శాతం) కేటాయించగా, 13,130 సీట్లు ఖాళీగా మిగిలాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 యూనివర్సిటీ కళాశాలల్లో అందుబాటులో ఉన్న 3,994 సీట్లకు 3,852 సీట్లు (96.44 శాతం) కేటాయించగా, 142 సీట్లు కేటాయించారు.

రెండు ప్రైవేట్ యూనివర్సిటీలలో 1,565 సీట్లు అందుబాటులో ఉండగా, 1,394 సీట్లు(89.07 శాతం) కేటాయించగా, 171 సీట్లు ఖాళీగా మిగిలాయి. 158 ప్రైవేట్ కళాశాలల్లో 68,512 సీట్లు అందుబాటులో ఉండగా, 55,695 సీట్లు కేటాయించారు. ప్రైవేట్ కళాశాలల్లో 12,817 సీట్లు మిగిలిపోయాయి. తొలివిడత కౌన్సెలింగ్‌లో 8,624 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చినా వారికి ఏ కాలేజీలోనూ సీటు రాలేదు. తొలివిడత కౌన్సెలింగ్ ద్వారా మిగిలిపోయిన సీట్లను రెండో విడత కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు ఈసారి మొదటిసారి ఇడబ్లూఎస్ కోటా అమలు చేస్తున్నారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో ఇడబ్లూఎస్ కోటా కింద 5,108 సీట్లు కేటాయించారు.

రికార్డు స్థాయిలో 34,83,850 ఆప్షన్లు

ఈ విద్యాసంవత్సరం రికార్డు స్థాయిలో 34,83,850 వెబ్ ఆప్షన్లు నమోదయ్యాయి. ఏటా సుమారు 24 లక్షల మంది వెబ్ ఆప్షన్లు నమోదవుతుండగా, ఈ సారి మాత్రం దాదాపు 10 లక్షల ఆప్షన్లు అధికంగా నమోదయ్యాయి. అంటే విద్యార్థులు ఈసారి ఎక్కువ ఛాయిస్ ఇస్తూ ఆప్షన్లు నమోదు చేసుకున్నట్లు అర్థమవుతోంది. ఈ విద్యాసంవత్సరం మొత్తం 71,216 మంది విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాగా, అందులో 69,793 వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు రాష్ట్రంలో 31 కాలేజీల్లో 100 శాతం సీట్లు కేటాయించారు. అందులో యూనివర్సిటీ కాలేజీలు ముందు వరుసలో ఉన్నాయి. యూనివర్సిటీ కాలేజీల్లో మొత్తం 91.44 శాతం సీట్లు కేటాయించగా, అందులో 6 యూనివర్సిటీల్లో 100 సీట్లకు కేటాయింపులు జరిగాయి. 25 ప్రైవేట్ కాలేజీల్లో 100 సీట్లు భర్తీ అయ్యాయి.

కంప్యూటర్ సైన్స్‌కు మొగ్గు

మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపులో కంప్యూటర్ సైన్స్, ఐటి అనుబంధ బ్రాంచీలకే విద్యార్థులు అత్యధికంగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. కంప్యూటర్ సైన్స్, ఐటి అనుబంధ బ్రాంచీల్లో 95.56 శాతం సీట్లు కేటాయించగా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కోర్సుల్లో 78.32 శాతం సీట్లు కేటాయించారు. ఈసారి సివిల్, మెకానికల్, అలైడ్ ఇంజనీరింగ్ బ్రాంచీలపై విద్యార్థులు ఆసక్తి కనబరచలేదు. ఈ కోర్సుల అనుబంధ బ్రాంచీల్లో 49.27 శాతం సీట్లకు కేటాయింపులు జరుగగా, 50 శాతానికి పైగా సీట్లు ఖాళీగా మిగిలాయి. అలా గే ఇతర ఇంజనీరింగ్ బ్రాంచీలైన మైనింగ్, కెమికల్, ఫుడ్ టెక్నాలజి, టెక్స్‌టైల్ టెక్నాలజి, ఫెసిలిటీస్ అండ్ సర్వీసెస్ ప్లానింగ్, ఫార్మసుటికల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ, డెయిరీయింగ్ తదితర కోర్సులలో 73.46 శాతం సీట్లు కేటాయించారు. ఇంజనీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్‌లో పలు బ్రాంచీల్లో వంద శాతం సీట్లు కేటాయించారు.

ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ ఛైన్ టెక్నాలజీ, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజి, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ మ్యాటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్(మెక్రోనిక్స్), ప్లానింగ్, బి.టెక్ మెకానికల్ విత్ ఎం.టెక్ థర్మల్ ఇంజనీరింగ్, బి.టెక్ మెకానికల్ విత్ ఎం.టెక్ థర్మల్ సిస్టమ్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్. బయో టెక్నాలజి,డెయిరీయింగ్ కోర్సుల్లో వంద శాతం సీట్లు కేటాయించారు. ఎంపిసి విద్యార్థులు ఫార్మసీ కోర్సుల్లో చేరడానికి అంతగా ఆసక్తి కనబరచలేదు. ఈ విద్యాసంవత్సరం మొత్తం 115 కళాశాలల్లో 4,199 సీట్లు అందుబాటులో ఉండగా, 228 సీట్లకు మాత్రమే కేటాయింపులు జరిగాయి. బి.ఫార్మసీలో 3,470 సీట్లు అందుబాటులో ఉండగా, మొదటి విడత కౌన్సెలింగ్‌లో 182 సీట్లు (5.01 శాతం) కేటాయించారు. 3,446 సీట్లు మిగిలిపోయాయి. 54 కాలేజీల్లో 571 ఫార్మా డి సీట్లు అందుబాటులో మొదటి విడతలో 46 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 525 ఫార్మా డి సీట్లు ఖాళీగా మిగిలాయి. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటాలో సీటు పొందిన అభ్యర్థులు తప్పనిసరిగా వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 23వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అలా చేయని అభ్యర్థుల సీటు కేటాయింపు రద్దువుతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News