- ఎమ్మెల్యే ఆరూరి రమేశ్
హసన్‌పర్తి: హసన్‌పర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని 67వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ నిర్వహిస్తున్న అండర్ 14, 17 క్రీడా పోటీలను బీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడారు. అనంతరం క్రీడాకారులకు ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. క్రీడలు మానసిక, శారీరక వికాసానికి తోడ్పడుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, గట్టు రాజుగౌడ్, హన్మకొండ జిల్లా ఆత్మ ఛైర్మన్ చంద్రమోహన్, జడ్పీటీసీ రేణిగుంట్ల సునీత, ఎంపీపీ కేతపాక సునీత, వైస్ ఎంపీపీ బండ రత్నాకర్‌రెడ్డి, సొసైటీ ఛైర్మన్లు బిల్లా ఉదయ్‌కుమార్‌రెడ్డి, జక్కు రమేశ్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ కొత్తకొండ సుభాష్‌గౌడ్, మార్కెట్ డైరెక్టర్లు సురేందర్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు బండి రజనీకుమార్, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకుడు పెద్దమ్మ రమేశ్, ఎంఈఓ రామకృష్ణరాజు, ప్రధానోపాధ్యాయుడు కుమార్, నరేశ్, నాగరాజు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.