Monday, January 20, 2025

ఇకపై శనివారాలు సైతం 14 కేంద్రాలలో పాస్‌పోర్ట్ సేవలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో 14 పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు ఇకపై శనివారం సైతం పనిచేస్తాయని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య వెల్లడించారు. ప్రస్తుత డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సిద్దిపేట, అదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, భువనగిరి, మంచిర్యాల, కామారెడ్డి, వనపర్తి, మేడ్చల్, వికారాబాద్ కేంద్రాలలో ఈ నెల 20 నుంచి పాస్ పోర్టు కార్యాలయాలు పనిచేస్తాయని అన్నారు.

తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు ఈ కేంద్రాలలో పాస్‌పోర్టు సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తుదారులందరూ www.passportindia.gov.in పోర్టల్ ద్వారా లేదా mPassportseva యాప్‌లో తమ దరఖాస్తులను రోజుకు రీషెడ్యూల్ చేసుకోవచ్చని అన్నారు. పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో ఎటువంటి వాక్ ఇన్ అభ్యర్థనలు స్వీకరించబోమని స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు పాస్‌పోర్ట్ సంబంధిత అవసరాల కోసం మధ్యవర్తులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News