Monday, January 20, 2025

నాలుగు శనివారాల్లో పాస్‌పోస్టు సేవలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలోని ఐదు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు,14 పోస్టాఫీసు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ఈ నెలలోని నాలుగు శనివారాలు పనిచేస్తాయని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు. నగరంలోని బేగంపేట్, అమీర్‌పేట, టోలీచౌకితో పాటు నిజామాబాద్, కరీంనగర్‌లోని పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, 14 తపాలా పాస్‌పోర్టు సేవా కేంద్రాలు 4 శనివారాలు పనిచేయనున్నాయని వెల్లడించారు.

ఈ నెల 8వ తేదీన రాష్ట్రంలోని ఈ 5 పాస్‌పోర్టు సేవా కేంద్రాలతోపాటు 14 తపాలా పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో సేవలందించనున్నట్లు చెప్పారు. శనివారం రోజు కోసం ప్రత్యేక డ్రైవ్ కింద సికింద్రాబాద్ పాస్‌పోర్టు అధికారి బాలయ్య 3,641 అపాయింట్మెంట్లు విడుదల చేశారు. www. passportindia.gov.in పోర్టల్ ద్వారా అపాయింట్మెంట్ స్లాట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా నేరుగా సేవా కేంద్రాలకు రావొద్దని.. మధ్యవర్తులను నమ్మొద్దని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News