Monday, December 23, 2024

గొల్లకురుమలు సబ్సిడీ గొర్రెలతో ఆర్థికంగా బలపడాలి

- Advertisement -
- Advertisement -
  • జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్

పెద్దేముల్: రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ గొర్రెలతో గొల్లకురుమలు ఆర్థికంగా బలపడాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని జనగాంలో పంపిణీ చేసిన గొర్రెల యూనిట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ గొల్ల కురుమల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా రెండో విడత గొర్రెలను పంపిణీ చేస్తుందని తెలిపారు.

జనగాంలో 24 మందికి గొర్రెలు పంపిణీ చేశామని చెప్పారు. గొర్రెలు పాటు రోగం బారిన పడకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి వైద్యం అవసరమైన వైద్యాధికారులను సంప్రదించాలన్నారు. అనంతరం శ్రీ బీరప్ప సంఘం అధ్యక్షులు పెద్ద నర్సప్ప ఆధ్వర్యంలో సంఘ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ మేరకు గొర్రెల పెంపకంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు డాక్టర్ ప్రహ్లాద్, మండల పశువైద్యాధికారి డాక్టర్ వెంకట్ రాజ్, వైద్య సిబ్బంది పుల్లమోళ్ళ నరేందర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News