Wednesday, January 22, 2025

అత్యధికంగా ఇళ్ల పట్టాలు అందించిన నియోజకవర్గం పటాన్ చెరు : మంత్రి హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి : రాష్ట్రంలో ఇంటింటికీ మంచినీరు అందించిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పఠాన్‌చేరు నియోజకవర్గంలో ఇండ్ల స్థలాల పంపిణీలో కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, టిఎస్ఎంఐసి చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ జిల్లాలో 830 జిల్లాలో 830 మందికి జీఓ నంబర్ 58 ద్వారా ఇళ్ల పట్టాలు పంపిణి చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందించిన నియోజకవర్గం పటాన్ చెరు అని అన్నారు. జిల్లాలో 830 మందికి జీవో నంబర్ 58 ద్వారా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. పేదల కోసం రాష్ట్రంలోని అత్యధికంగా పటాన్‌చెరు నియోజకవర్గం లో 13 బస్తీ దవఖానాలను ఏర్పాటు చేశానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ను, బిఆర్‌ఎస్‌ను నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News