Thursday, January 23, 2025

అభివృద్ధికి రోల్ మోడల్ పటాన్‌చెరు నియోజకవర్గం

- Advertisement -
- Advertisement -

పటాన్ చెరు: నియోజకవర్గం అభివృద్ధ్దిలో జిల్లాలో రోల్ మోడల్‌గా ఉందని ,ప్రతి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధ్ది చేశామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.శుక్రవారం మండల పరిధిలోని పాటి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతి కార్యాలయాన్ని గ్రామ సర్పంచ్ మున్నురు లక్ష్మితో కలసి ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గ్రామంలో రూ. కోటి 50 లక్షలతో పంచాయతి భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు.గ్రామీణ వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలతో గ్రామ పంచాయతీలు అభివృద్ధ్ది జరుగుతున్నాయన్నారు.నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలన్నిటిని స్థానిక పరిశ్రమల భాగస్వామ్యంతో అభివృద్ధ్ది చేస్తున్నట్టుగా తెలిపారు. మనం ప్రజలకు ఏ విధంగా సహాయపడుతున్నామని ఆలోచన చేయాలన్నారు.

సిఎం కెసిఆర్ నాయకత్వంలో ప్రతి రంగంలో అభివృద్ధ్ది చెందుతుందన్నారు. ఎంపిపి సుష్మశ్రీ వేణుగాపోల్ రెడ్డి,జెట్పిటీసీ సుప్రజా వెంకట్ రెడ్డివైస్ ఎంపిపి స్వప్న శ్రీనివాస్,ఎంపిటిసి సునితా గోపాల్ నాయకులు దశరత్ రెడ్డి,వెంకట్ రెడ్డి,స్వామి గౌడ్, భూపాల్ రెడ్డి,అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News