Monday, December 23, 2024

పటాన్‌చెరు అన్నిరంగాల్లో అభివృద్ధి

- Advertisement -
- Advertisement -
  • రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు

పటాన్ చెరు: రాష్ట్ర నలు దిక్కులు ఉన్న ప్రతి జిల్లాను, గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించే విధంగా పనిచేస్తున్న ఏకైక నాయకులు ముఖ్య మంత్రి కెసిఆర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు గురువారం పటాన్‌చెరు పట్టణానికి ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరై సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు.ఆనాటి ప్రభుత్వ హయాంలో కరెంటు కోతలతో పరిశ్రమలు మూతపడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మూతపడ్డ పరిశ్రమలు తెరుచుకోవడమే కాకుండా నూతన పరిశ్రమలు వచ్చాయన్నారు. తెలంగాణ వస్తే తెలంగాణలో కరెంటే ఉండదన్న వాళ్ల నోర్లు మూత పడ్డాయన్నారు. 24 గంటల విద్యుత్ ఇవ్వడంతో పరిశ్రమలు లాభాలతో నడుస్తు కార్మికులకు మంచి ఉపాధి లభిస్తుందన్నారు.

సింగూరు నీళ్లను సంగారెడ్డి, మెదక్ జిల్లాకు ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌దేనన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాపై ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పూర్తి అవగాహన ఉందన్నారు. సంగారెడ్డి జిల్లాకు రూ.510 కోట్లతో మెడికల్ కాలేజి ఇచ్చిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. దేశంలోనే మొట్ట మొదటి రెసిడెన్సియల్ లా కాలేజి సంగారెడ్డికి రావడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా చివర ఉన్న మండలాలకు తాగునీరు అందించిన ఘనత కెసిఆర్‌దేనన్నారు. జిల్లాలో 3 మున్సిపాలిటీలు, రెండు మండలాలు ఏర్పాటు చేయడమైనదన్నారు. జిల్లాకు పోల్యూషన్ రహిత పరిశ్రమలు ఎన్నో వస్తున్నాయన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో గతంలో 30 శాతం డెలివరీలు జరుగుతే నేడు ప్రభుత్వాసుపత్రుల ఆధునీకరణతో 70 శాతం డెలివరీలు జరుగుతున్నాయన్నారు.

సంగారెడ్డి జిల్లాలో 82 శాతం డెలివరీలు జరిగి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలువడం సంతోషించదగ్గ విషయమన్నారు. బస్తీ దవఖానాలతో పల్లెల్లో మంచి వైద్యం అందుతుందన్నారు. వైద్య, విద్య పేదలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ శివనగర్‌లో సుమార్ 400 ఎకరాల ల్యాండు ఉన్నదని అందులో పరిశ్రమల స్థాపనకు అవకాశం ఇస్తే ఈ ప్రాంత యువతకు అవకాశం ఇచ్చిన వారవుతారని సిఎం దృష్టికి తీసుకొచ్చారు.శరవేగంగా అభివృద్ధి జరుగుతున్న 3 మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేయాల్సిందని కోరారు. రామచంద్రాపురం రాయ సముద్రం చెరువు సుందరీకరణకు నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరారు. మియాపూర్ నుంచి ఇస్నాపూర్ పారిశ్రామిక ప్రాంతానికి మెట్రో రైలు సౌకర్య ం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News