Friday, November 15, 2024

పతంజలి ఫుడ్స్ ప్రమోటర్ షేర్ల స్తంభన!

- Advertisement -
- Advertisement -

ముంబై: స్టాక్ ఎక్స్‌ఛేంజిలైన ఎన్‌ఎస్‌ఈ, బిఎస్‌ఈ బాబా రామ్‌దేవ్ నేతృత్వంలోని ‘పతంజలి గ్రూప్ కంపెనీ అయిన పతంజలి ఫుడ్స్’ ప్రమోటర్ షేర్లను స్తంభింపజేశాయి. అయితే దీనివల్ల కంపెనీ కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం ఉండబోదని పతంజలి ఫుడ్స్ కంపెనీ తెలిపింది.

ఇదివరలో రుచి సోయా ఇండస్ట్రీస్ పేరిట ఉండిన పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ షేర్లను గురువారం స్తంభింపజేశారు. అయితే దాని ప్రభావం ఆర్థిక స్థితిపై, కంపెనీ కార్యకలాపాలపై ప్రభావం చూపబోదని ఆ కంపెనీ వివరణ ఇచ్చింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనలు కొద్దిగా కూడా పాటించనందున బిఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ స్టాక్ ఎక్స్‌ఛేంజిలు పతంజలి గ్రూప్‌కు చెందిన 21 సంస్థల షేర్లను స్తంభింపజేశాయి. పతంజలి ఆయుర్వేద్ సహా అనేక కంపెనీలు కనీస నిబంధనలను కూడా పాటించడంలేదని తెలిసింది. స్టాక్ ఎక్స్‌ఛేంజిలు ఆచార్య బాలకృష్ణ, పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్, పతంజలి పరివాహన్, పతంజలి గ్రామోద్యోగ్ నయాస్ సహా 21 సంస్థలను స్తంభింపజేశాయి. దాదాపు 29, 25,75,299 ఈక్విటీ షేర్లు ఈ స్తంభన వల్ల ప్రభావితం కానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News