Monday, December 23, 2024

14 ఉత్పత్తుల అమ్మకాలు నిలిపివేశాం: పతంజలి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ శాఖ తయారీ లైసెన్సులు సస్పెండ్ చేసిన 14 ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేసినట్లు పతంజలి ఆయుర్వేద కంపెనీ మంగళవారం సుప్రీంకోర్టుకు తెలియచేసింది. ఈ ఉత్పత్తులను ఉపసంహరించాలని 5,606 ఫ్రాంచైస్ స్టోర్లకు ఆదేశాలు జారీచేసినట్లు జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి పతంజలి ఆయుర్వేద కంపెనీ వివరించింది.

ఈ 14 ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపార ప్రకటనలను అన్ని రూపాలలో ఉపసంహరించాలని కూడా మీడియా సంస్థలను ఆదేశించినట్లు కంపెనీ విన్నవించింది. ఈ 14 ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపార ప్రకటనలను ఉపసంహరించడానికి మీడియా సంస్థలు అంగీకరిస్తూ వాటిని ఉపసంహరించాయా వంటి వివరాలతో రెండు వారాలలో ఒకఅ ఫిడవిట్‌ను సమర్పించాలని పతంజలి ఆయుర్వేద కంపెనీని కోర్టు ఆదేశిస్తూ కేసు తదుపరి విచారణను జులై 30వ తేదీకి వాయిదా వేసింది.

కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను, నవీన వైద్య విధానాలను కించపరుస్తూ పతంజలి ఆయుర్వేద కంపెనీ చేస్తున్న ప్రచారానికి వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. పతంజలి ఆయర్వేద లమిటెడ్, దివ్య ఫార్మసీకి చెందిన 14 ఉత్పత్తుల తయారీ లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు ఉత్తరాఖండ్ స్టేట్ లైసెన్సింగ్ అథారిటీ గతంలోనే సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రజలను తప్పుదారి పట్టించే వ్యాపార ప్రకటనల కేసులో యోగా గురు రాందేవ్, ఆయన అనుచరుడు బాలకృష్ణ, పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌పై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసుపై సుప్రీంకోర్టు మే 14న తన తీర్పును రిజర్వ్ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News