Friday, January 24, 2025

రేవంత్ రెడ్డి పతనం తప్పదు:పటేల్ ప్రభాకర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

గద్వాల : ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకులను పక్కన పెట్టి పార్టీలో ప్యారాచూట్ లీడర్లకు ప్రాధాన్యత ఇస్తూ టీపీసీసీ అధ్యక్షడు రేవంత్‌రెడ్డి డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా పైసలు ఇచ్చినోళ్లకు టికెట్లు ఇచ్చారంటూ డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తూ బుధవారం ఆ పార్టీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామ చేసి, రాజీనామ పత్రాన్ని టీపీసీసీ అధిష్టానానికి పంపినట్లు వెల్లడించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పటేల్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ…టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని తప్పుదోవ పటిస్తూ పార్టీనీ నాశనం చేస్తున్నారని, పార్టీలో ప్యారాచూట్ నాయకులకు మాత్రమే టికెట్లు కేటాయిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకులకు రేవంత్‌రెడ్డి అన్యాయం చేసి, వాళ్ల బతుకులను ఆగం చేశారని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి నమ్మక ద్రోహి అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవు. డబ్బులతో రాజకీయ చేస్తున్న వారిని గద్వాల ప్రజలు తిప్పి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. గత 25 సంవత్సరాలుగా గద్వాలలో కాంగ్రెస్ పార్టీలో సేవలు చేస్తూ… జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాని, 2018లో అప్పటి మాజీ మంత్రి డీకే అరుణ కాంగ్రెస్ పార్టీని వీడినప్పటికి, కాంగ్రెస్ క్యాడర్‌ను కాపాడుకుంటూ.. పార్టీ బలోపేతం చేశానన్నారు. కాంగ్రెస్ పార్టీ అదిష్ఠానం ఆదేశాల మేరకు ఆ పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేసినట్లు, ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి, ఎన్నో సమస్యలను ఎదుర్కొని పని చేశానని గుర్తు చేశారు. రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరూ కూడా గద్వాల వైపు కన్నెత్తి చూడకపోయిన పార్టీని రక్షించుకోవడం జరిగిందన్నారు. ఈ మద్య కాలంలో గద్వాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థి సెలక్షన్ విషయంలో వస్తున్న వార్తలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను భంగం కలిగిస్తున్న నేపథ్యంలో ఏ ఒక నాయకుడు ఖండించకపోవడం, పార్టీ ప్రతిష్ట మసకబారి పోయింది అని అన్నారు.

ఎన్నో సంవత్సరాలుగా పని చేస్తున్న జిల్లా అధ్యక్షుడిని సంప్రదించకుండానే గద్వాల కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించారని, కోట్ల రూపాయాలు చేతులు మారాయని కోడై కూస్తున్న పరిస్థితులలో డబ్బులకు ఒకటే కాంగ్రెస్ పార్టీలో విలువనిస్తారని, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీకి కాపాడిన వ్యక్తులకు విలువలేని సందర్భంగా తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ మరియు కాంగ్రెస్ పార్టీపైన అభిమానం ఉన్నప్పటికి పార్టీలో పని చేయలేని పరిస్థితి ఏర్పడిందని, అవినీతిపరులైన నాయకులు పార్టీలో ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదు అని భావించి పార్టీకీ రాజీనామ చేసినట్లు వెల్లడించారు. బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆహ్వానం మేరకు బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. త్వరలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News