Wednesday, December 25, 2024

మీడియా ముందు విలపించిన పటేల్ రమేశ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: పటేల్ రమేష్ రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. సూర్యాపేటలో ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నుంచి పటేల్ రమేష్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో ఫార్వార్డ్ బ్లాక్ నుంచి ఆయన నామినేషన్ దాఖాలు చేశారు. మల్లురవి, రోహిత్ చౌదరి బుజ్జగింపుతో ఆయన వెనక్కి తగ్గారు. ఎంపి టికెట్ ఇస్తామని రమేష్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. కెసి వేణుగోపాల్, రేవంత్, ఉత్తమ్ కుమార్ తో చర్చించి నేతలు హామీ ఇచ్చినట్లు సమాచారం. నామినేషన్ ఉపసంహరించుకుని రేమేశ్ రెడ్డి మీడియా ముందు మాట్లాడుతూ కన్నీరుమున్నీరుగా విలపించారు. పార్టీ కోసమే నామినేషన్ ఉపసంహరించుకున్నానని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News