Wednesday, January 29, 2025

పటేల్ రమేష్ రెడ్డి నామినేషన్ ఉపసంహరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సూర్యాపేటలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డి నామినేషన్ ఉపసంహరణపై ఉత్కంఠ కొనసాగింది. పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో రెండు గంటలకు పైగా కాంగ్రెస్ సీనియర్ నేతల బుజ్జగింపులు జరిగాయి. ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అధిష్టానం నుంచి హామీలు ఇప్పించారు. పటేల్ రమేష్ రెడ్డికి ఎంపీ హామీ ఇవ్వడంతో నామినేషన్ ఉపసంహరించుకున్నారు. నేడు పటేల్ రమేష్ రెడ్డిని పోటీ నుంచి తప్పించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. నవంబర్ 15 నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. కాగా, తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News