Saturday, November 23, 2024

పదేళ్లలో మంథని పట్టణ ప్రగతికి బాటలు

- Advertisement -
- Advertisement -

మంథని: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే మంథని పట్టణ ప్రగతికి బాటలు పడ్డాయని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంథని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరిగిన పట్టణ ప్రగతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు.అంతకుముందు మహిళలతో కలిసి బోనం ఎత్తుకుని పట్టణ పురవీదుల గుండా ప్రదర్శనలతో బస్టాండ్ ఎదురుగా ప్రధాన రహదారిపై బతుకమ్మ ఆటలు ఆడారు. పట్టణంలోని మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం గాంధీ చౌక్‌లో ఏర్పాటు చేసిన సభకు ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్షమే మంథని పట్టణ వెనుకబాటు తనానికి కారణ మన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్, జడ్పీ చైర్మన్ పుట్ట మదుకర్ ఆధ్వర్యంలో మంథని పట్టణం అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు. ఒకప్పుడు దుర్గందం వెదజల్లే ఇస్మాన్‌పుర రూపురేఖల్ని మార్చి ఈనాడు ఉస్మాన్‌పురలో పట్టణ వాతావరణం కల్పించిన చరిత్ర ఉందన్నారు.

మున్సిపాలిటీలో సామాన్యులపై పన్నుల భారం పడకుండా జడ్పీ చైర్మన్‌తో కలిసి ఆలోచనలు చేస్తున్నామన్నారు. అంబేద్కర్ నగర్‌లో సైతం మెరుగైన సౌకర్యాలు కల్పించామని ఆమె గుర్తుకు చేశారు. రావుల చెరువు, తమ్మి చెరువు, బొక్కలవాగు కట్టలపై సీసీ రోడ్లు, వాకింగ్ ట్రా క్‌లు నిర్మించి ప్రజలకు సౌకర్యాలు మెరుగుపర్చామన్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో మంథని ము న్సిపాలిటీ ఎంతో అభివృద్ది చెందిందన్నారు. మంథని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపాలన్నదే తమ ఆకాంక్ష అని అన్నా రు. అనంతరం మున్సిపల్‌లో ఉత్తమ సేవలు అందించిన కార్మికులకు ప్రశంసా పత్రాలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News