Sunday, December 22, 2024

ఉపాధికి బాటలు.. దళిత కుటుంబాల్లో వెలుగులు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ సంక్షేమం….దిక్కుతొచని ప్రతిపక్షం
“దళిత బంధు”వు కెసిఆర్ సర్కార్
సంక్షేమంలో దేశానికే ఆదర్శం తెలంగాణ రాష్ట్రం

మన తెలంగాణ / హైదరాబాద్ : నీళ్ళు. నిధులు. నియామకాలు.. ఇదే నినాదం..కెసిఆర్ నడిపిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. తెలంగాణ వ్యాప్తంగా ఉరుకలెత్తిన ఉద్యమం… చివరకు సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రం అనుకున్నట్లయ్యింది. తొలి తెలంగాణ ప్రభుత్వానికి లభించింది కెసిఆర్ సారథ్యం. మాట తప్పలేదు. ఉద్యమ సమయంలో ఇచ్చిన వాగ్దానాలపై వెనుకడుగు వేయలేదు. వాటికి మించి మరెన్నో సంక్షేమ పథకాలు తెలంగాణ వాసుల సొంతమయ్యాయి. వారి జీవన స్థితిగతులు మార్చేశాయి. “ ఊరికి చివరనే మా పాకలెందుకు” అన్న ఓ సినీ కవి హృదయం నుంచి ఆవేదనతో బయటపడ్డ ఆ భావాన్నే చెరిపేశాడు,  కెసిఆర్. దళితుల జీవితాలనే తిరగరాసేశాడు. అలాంటి వాటిలోనే ఒకటి “దళిత బంధు” పథకం. ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా చేసిన చంద్రశేఖర రావు మదిలోంచి వెలిసిన ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది.

దళిత కుటంబాలకు ఉపాధి బాటలు వేసింది. వేలాది కుటుంబాలకు వేలాది కోట్ల రూపాయలను వెచ్చించింది కెసిఆర్ ప్రభుత్వం, సంక్షేమంలో అందరికంటే ఒక అడుగు ముందుండే తెలంగాణ రా్రష్ట్రం దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, వారి జీవన స్థితిగతులను మెరుగు పరిచేందుకు ఈ అద్భుత పథకాన్ని ఆంకురార్పణ చేసింది. దళిత బంధు పథకం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల దృష్టిని ఆకర్శించింది. ఇప్పటికే దళిత బంధు తొలి దశ విజయవంతంగా పూర్తి చేసుకొని రెందో దశ అమలుకు కార్యాచరణను చేపట్టింది. ఈ పథకం కింది ప్రతి దళిత కుటుంబాలకు రూ. 10 లక్షలు గ్రాంటుగా సహాయం చేస్తోంది. దళితులకు బతుకు బాట చూపిస్తోంది. ఈ పథకం యావత్ దేశంలోనే చర్చనీయాంశంగా మారింది. బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఈ అద్భుత పథకం గురించి ఇతర రాష్ట్రాలు ఆరా తీస్తున్నాయి. తెలంగాణను అదర్శంగా తీసుకొని దేశ వ్యాప్తంగా ఇలాంటి పథకాన్ని అమలు చేయాలని దేశ వ్యాప్తంగా దళితులు డిమాండ్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ పథకాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు సాధ్యాసాధ్యాలు ఎలా ఉంటాయనే విషయమై పలు రాష్ట్రాలు అధ్యయనం చేశాయి.

ముఖ్యమంత్రి కెసిఆర్ మానస పుత్రిక అయిన దళిత బంధు పథకం తొలిదశలో ఇప్పటివరకు 38 వేల 323 కుటుంబాలకు లబ్ది చేకూరింది. ప్రతి కుటుంబానికి వారు ఎంచుకున్న స్వయం ఉపాధి పొందేందుకు పూర్తి స్వేచ్ఛనిచ్చే ఈ పథకం కింద , ప్రతి యూనిట్‌కు రూ. 10 లక్షలు గ్రాంటుగా ఇవ్వడం జరుగుతోంది. తొలి విడతలో ప్రభుత్వం రాష్ట్రంలోని దళిత కుటుంబాలకు సుమారు రూ. 3,900 కోట్లు ఖర్చు చేసింది. దీంతో దళితుల జీవన ప్రమాణాలు పెరిగాయి. స్వయం ఉపాధి ద్వారా దళితులు మెరుగైన ఆదాయాన్ని పొంది గౌరవప్రద జీవనం గడుపుతున్నారు. దళితులు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ఈ పథకం పోత్సహిస్తోంది. ఈ పథకం కింద నిర్మాణ రంగానికి పనికివచ్చే ఇటుకల తయారీ యూనిట్లు, ఎవర్‌గ్రీన్ వ్యాపారం అయిన ఆటో మొబైల్ షాపులు, పుస్తకాల షాపులు, ఎరువులు, పురుగుల మందుల దుకాణాలు, రైస్ మిల్లులు, సిమెంట్ దుకాణాలు, హార్వెస్టర్ యూనిట్లు, మెడికల్ స్టోర్స్, పేపర్ ప్లేట్ తయారీ యూనిట్‌లు, ఎలక్ట్రికల్ షాపులు, షూ మార్ట్, ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్, మినీ డైరీ యూనిట్, ఐరన్ బెడ్స్ తయారీ యూనిట్‌లు, కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ యూనిట్‌లు, సంచుల తయారీ కేంద్రం లాంటి స్వయం ఉపాధి మార్గాల ద్వారా దళిత కుటుంబాలు ఆర్థికంగా తమ జీవన ప్రమాణాలు మెరుగు పరుచుకున్నాయి. చిన్న యూనిట్లను పెట్టుకోవడం, వ్యాపారాలు చేయడం ద్వారా నెలకు పాతిక నుండి రూ.30 వేల వరకు సంపాయిస్తున్నట్లు దళిత లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని 119 శాసన సభ నియోజకవర్గాల్లో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం కింద లబ్ది చేకూర్చేలా తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి 2023 — 24 వార్శిక బడ్జెట్‌లో రూ. 17,700 కోట్లు కేటాయించింది. దశాబ్దాలుగా అమలు చేస్తున్న సాంప్రదాయ పథకాలకు బదులుగా దళిత బంధు పథకంలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.

లబ్దిదారుని అభిరుచి, ఇష్టా ఇష్టాలకు లోబడి స్వయం ఉపాధిని ఎంచుకునే స్వేచ్ఛను లబ్దిదారిడికే కల్పించింది. దళిత బంధు రక్షణ నిధిని ఏర్పాటు చేసి ఆపద సమయంలో ఆదుకునేందుకు, ఈ పథకాన్ని బలోపేతం చేయడం జరిగింది. ఇందుకోసం లబ్దిదారుడు రూ.10 వేలు, ప్రభుత్వం రూ. 10 వేలు ఈ నిధికి వాటాగా సమకూర్చడం జరుగుతోంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జులై 2021లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షల సహాయం అందించారు. ఫలితంగా అనేక స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని దళితులు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. మొత్తం 93 రకాల స్వయం ఉపాధి మార్గాలకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఆర్థిక సహాయం అందించింది.

అందులో ముఖ్యంగా క్యాబ్‌లు నడిపేందకు కార్లు కొనుగోలు చేయడం, ట్రాక్టర్లు, మందుల షాపులు, ఎరువుల దుకాణాలు, పాల ఉత్పత్తుల విక్రయం, ఇలా రక రకాల ఆదాయం వచ్చే వృత్తులను లబ్దిదారులు ఎంచుకున్నారు. పాసింజర్ వెహికల్స్, డెయిరీ ఫారంలు, గూడ్స్ వెహికిల్స్, మిని సూపర్ బజార్, జెసిబి, బట్టల షాపులు, రెడిమెడ్ గార్మెంట్, షీప్ యూనిట్స్, పౌల్ట్రీ ఫారం, లాంటి అనేక ఉపాధి మార్గాలను లబ్దిదారులు ఎంచుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గంలోని వాసాలమర్రి గ్రామ పంచాయతీలో ఆగష్టు 2021లో ఈ పథకం కింద 75 మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూర్చారు. ఖమ్మం సూర్యాపేట, నాగర్ కర్నూల్, కామారెడ్డి జిల్లాల్లోని ఎస్‌సి అసెంబ్లీ నియొజకవర్గాలు మధిర, తుంగతుర్తి, అచ్చంపేట, జుక్కల్ లోని ఒక్కో గ్రామాన్ని ఎంచుకొని ఈ పథకాన్ని అమలు చేశారు. దీంతో 4వేల 808 మంది దళిత కుటుంబాలకు లబ్దిచేకూరింది. 2021 -22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 118 అసెంబ్లీ నియోజవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 100 కుటుంబాల చొప్పున మొత్తం 11,800 కుటుంబాలకు దళిత బంధు పథకం కింద లబ్ది చేకూర్చారు. రెండో దశలో ఈ పథకాన్ని మరింత పకడ్బందీగా, వైఫల్యాలకు ఆస్కారం లేకుండా అమలు చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Dalit 2

Dalit 3

Dalit 4

Dalit 5

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News