Sunday, December 22, 2024

నిసాంకా నయా చరిత్ర..

- Advertisement -
- Advertisement -

పల్లెకెలె: అఫ్గానిస్థాన్‌తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో శ్రీలంక ఓపెనర్ పథూమ్ నిసాంకా చారిత్రక బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. నిసాంకా అజేయ డబుల్ సెంచరీతో శ్రీలంక క్రికెట్‌లో నయా చరిత్ర సృష్టించాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 381 పరుగులు సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన అఫ్గాన్ తాజా సమాచారం లభించే సమయానికి 35 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన లంకకు ఓపెనర్ నిసాంకా మెరుపు ఆరంభాన్ని అందించాడు. అఫ్గాన్ బౌలర్లను హడలెత్తించిన నిసాంకా 139 బంతుల్లోనే 8 సిక్సర్లు, 20 ఫోర్లతో 210 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి మరో ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (88), సమరవిక్రమ (45) సహకారం అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News