Monday, December 23, 2024

పాటియాలా ఘర్షణల కీలక కుట్రదారుడు బర్జిందర్ సింగ్ పర్వానా మొహాలీలో అరెస్టు!

- Advertisement -
- Advertisement -

Parwana

 

రాజ్‌పురా నివాసి అయిన పర్వానాను మొహాలీ నుంచి చండీగఢ్ ఎయిర్‌పోర్టు వైపు వెళ్తుండగా పట్టుకున్నారు.

న్యూఢిల్లీ: పాటియాలాలో ఇటీవలి హింసాకాండ వెనుక ప్రధాన సూత్రధారి అయిన బర్జిందర్ సింగ్ పర్వానాను మొహాలీలో అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం (మే 1, 2022) తెలిపారు. రాజ్‌పురా నివాసి అయిన పర్వానా చండీగఢ్ విమానాశ్రయం వైపు వెళుతుండగా పోలీసులు పట్టుకున్నారని ఐజి-పాటియాలా ముఖ్విందర్ సింగ్ చిన విలేకరుల సమావేశంలో తెలిపారు. శనివారం బాధ్యతలు స్వీకరించిన చిన  ఇప్పటివరకు ఆరుగురు నిందితులను అరెస్టు చేశామన్నారు. కాగా సంఘ వ్యతిరేక, దేశ వ్యతిరేక వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News