Friday, November 22, 2024

తిరుపతిలో మహిళా డాక్టరుపై పేషంట్ అమానుష దాడి

- Advertisement -
- Advertisement -

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఉన్న శ్రీ  వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS)లో ఒక మహిళా డాక్టర్‌పై రోగి దాడి చేశాడు. ఆగస్ట్ 24న ఎమర్జెన్సీ వార్డులో ఈ ఘటన జరిగింది. హాస్పిటల్ వార్డులోని సిసిటీవి ఫుటేజీలో డాక్టర్‌ను రోగి వెనుక నుంచి వెంబడిస్తున్నట్లు కనబడింది. అతను ఆమె జుట్టును లాగి, హాస్పిటల్ బెడ్ యొక్క మెటల్ ఫ్రేమ్‌కి బాదాడు. దాడి చేసిన వ్యక్తిని డ్యూటీ వైద్యులు , చుట్టుపక్కలవారు వెంటనే పట్టుకున్నారు.

దాడి చేసిన వ్యక్తిని విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన బంగారు రాజుగా గుర్తించారు, అతను మూర్ఛ వ్యాధితో ఆసుపత్రిలో చేరాడు. ఆయనను ముందు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అశ్విని ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ, తర్వాత ‘స్విమ్స్‌’కు తరలించారు. దాడికి గల కారణం అస్పష్టంగానే ఉంది. ఈ ఘటన అనంతరం పలువురు జూనియర్ డాక్టర్లు, హెల్త్‌ కేర్ వర్కర్లు కార్యాలయంలో భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.

మహిళా డాక్టర్,  ఆసుపత్రి డైరెక్టర్‌కు రాసిన వ్రాతపూర్వక ఫిర్యాదులో భద్రతా సమస్యలను ఎత్తిచూపారు. దాడి చేసిన వ్యక్తి పదునైన వస్తువు లేక ఆయుధం కలిగి ఉన్నట్టయితే పరిస్థితి ప్రాణాపాయంగా ఉండేదని ఆమె పేర్కొన్నారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News