Tuesday, January 21, 2025

వైద్యుడి నిర్లక్ష్యం ..నిండు ప్రాణం బలి

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం బలి అయిన విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వైద్యుడు సర్జరీలో చేస్తుండగా స్టాఫ్  పేషంట్ పరిస్థితి వివరించినప్పటికి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో  వైద్యుడు వచ్చే సరికి పేషంట్ ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాసిపేట మండలం కోమటిచేనుకు చెందిన జాడి సంతోష్ (24) అనారోగ్యంతో శనివారం రాత్రి 8 గంటలకు మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం సమస్య తీవ్రంగా ఉందని, కానీ తాము వైద్యం అందించి వ్యాధి నయం అయ్యేలా చేస్తామని డాక్టర్ నమ్మబలికాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పేషంట్ అవస్థ ఎక్కువ అవడంతో డాక్టర్ వద్దకు వెళ్లగా డాక్టర్ సర్జరీలో ఉన్నాడు. సిబ్బందికి పరిస్థితి వివరించగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

సర్జరీ ముగించుకొని డాక్టర్ పేషంట్ వద్దకు వచ్చి చూసే సరికి పేషంట్ ప్రాణాలు కోల్పోయి ఉన్నాడు.. కాని చనిపోయిన విషయాన్ని నిర్ధారణ చేయకుండా హుటాహుటిన కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించడం విడ్డూరం. అంబులెన్స్ ఎక్కగానే పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు. వెంటనే అంబులెన్స్ నుంచి మృతదేహాన్ని దింపి ఆసుపత్రి ఎదుట తమకు న్యాయం చేయాలంటూ ఆందోలనకు దిగారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు ఆందోళనను అదుపుచేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News