Friday, December 20, 2024

ఢిల్లీ ఆస్పత్రిలో మంటలు.. రోగి మృతి

- Advertisement -
- Advertisement -

Patient dies in Delhi hospital fire

న్యూఢిల్లీ: ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో శనివారం తెల్లవారుజామున మంటలు చెలరేగి ఆక్సిజన్ అందక ఒక 64 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. పూత్ ఖుర్ద్‌లోని బ్రహ్మ సాగర్ ఆస్పత్రిలోని మూడవ అంతస్తులో షార్ట్ సర్కూట్ ఏర్పడి మంటలు చెలరేగాయని, ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో హోలి అనే కిడ్నీ రోగి మరణించాడని అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 5 గంటలకు సమాచారం అందడంతో స్థానిక పోలీసులు ఆస్పత్రిని చేరుకుని ఫైర్ సర్వీసుకు కబురు పెట్టారని, 11 అగ్నిమాపక శకటాలు అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయని డిసిపి ప్రణవ్ తయాల్ తెలిపారు. ఐసియులో వెంటిలాటర్ సపోర్ట్‌తో ఉన్న ఒక్క రోగి మినహాయించి మిగిలిన రోగులందరినీ సురక్షితంగా తరలించినట్లు ఆయన చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News