Wednesday, January 22, 2025

నిమ్స్ బిల్డింగ్‌పై నుంచి దూకి రోగి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  బిల్డింగ్‌పై నుంచి దూకి ఓ రోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం….ఖమ్మం జిల్లా వై లకా్ష్మపురానికి చెందిన అచ్చయ్య గత కొంత కాలం నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం జనవరి 16వ తేదీన అచ్చయ్య నిమ్స్ ఆస్పత్రిలో చేరాడు.

అప్పటి నుంచి వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఈ క్రమంలోనే అచ్చయ్య కడుపు నొప్పిని భరించలేక నిమ్స్ స్పెషాలిటీ బ్లాక్‌లోని రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నిమ్స్ ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా, అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News