Sunday, December 22, 2024

కీళ్ల మార్పిడి.. గంటలోనే నడచిన పేషంట్

- Advertisement -
- Advertisement -

నారాయణపేట: నారాయణపేట పట్టణంలోని పిఎస్ సునంద మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్ పాత గంజి ఏరియాలో డా ప్రసాద్ శెట్టి, డా దీపికా శెట్టిల ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా తీవ్రమైన మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న కర్ణాటక రాష్ట్రం చిన్న సంబరం గ్రామానికి చెందిన 48 సంవత్సరాల వయస్సు గల ఆశమ్మ అనే పేషంట్‌కు బుధవారం మోకాళ్ల కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా చేసి, చికిత్స అనంతరం పేషంట్‌ని గంటలోనే నడిపించి అందరు ఆశ్చర్యపడేలా చేశారు. డా. పిఎస్ హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలలో చికిత్సకు అయ్యే ఖర్చులో కేవలం సగం ధరకే చికిత్స చేసి అందరి మన్ననలు పొందారు. ఇలాంటి గొప్ప గొప్ప ఆపరేషన్లు మన అందరికి అందుబాటులో నారాయణపేటలో జరగడం పేట ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News