Saturday, December 28, 2024

రోగులకు సిఎంఆర్‌ఎఫ్‌తో ఎంతో మేలు

- Advertisement -
- Advertisement -

తార్నాక: అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకోలేని వారికి సిఎం రిలీఫ్ ఫండ్ ఎంతో మేలు చేస్తుందని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతశోభన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం తార్నాక క్యాంపు కార్యాలయంలో బిఆర్‌ఎస్ కార్మిక విబాగం అధ్యక్షుడు మోతే శోభన్‌రెడ్డితో కలిసి అర్హులకు సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్ద మనసుతో రాష్ట్ర ప్రజలకు నేనున్నానని ధైర్యం కల్పిస్తూ వారికి వైద్య పరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అండగా నిలుస్తున్నారని తెలిపారు. అనారోగ్యంతో బాధపడే వారు అధైర్య పడవద్దని, వారు సిఎం రిలీఫ్ ఫండ్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News