Saturday, November 2, 2024

నిమ్స్‌లో ‘వీల్ చైర్లకు’ రెక్కలు..

- Advertisement -
- Advertisement -

Patients Facing Problems In NIMS Hospital

వందల సంఖ్యలో ఉన్నా కనిపించని వీల్ చైర్లు
నిత్యం నరకం చూస్తున్న రోగులు
ప్రతి విభాగంలో ఇదే పరిస్థితి

పంజాగుట్ట : వైద్యసేవల్లో మేటిగా నిలిచి, ఖ్యాతి గడించిన నిమ్స్ ఆసుపత్రి, అక్కడికి వెళితే అన్ని రోగాలు తగ్గుతాయనేది రోగుల నమ్మకం. అదే రీతిలో ఆ ఆసుపత్రికి కూడా అంతే పేరు ఉంది. కానీ నేడు ఆసుపత్రికి వెళ్తే నడవలేని రోగికి వీల్ చైర్ కూడా దొరకని పరిస్థితి. నిమ్స్‌లోని ప్రతి విభాగంలో రోగి బంధువులు వీల్ చైర్ల కోసం వెతుక్కోవడం, బ్రతిమలాడు కోవడం కనిపిస్తుంది. మరి కొంత మంది చేసేదేం లేక ఇద్దరు వ్యక్తులు రోగిని ఎత్తుకొని పోవడం కనిపిస్తుంది. ఇవన్నీ కంటికి కనిపిస్తున్నా అక్కడ పట్టించుకునే నాథుడే కనిపించడు. రోగులకి ప్రాథమిక అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితి నిమ్స్‌లో ఉంది. ఇక్కడి ప్రతి రోజూ అన్ని ఓపిలకి వివిధ వ్యాధులతో ఓపి విభాగానికి రెండు వేల మంది పైగా వస్తుంటారు. ఐతే నడవలేని పరిస్థితిలో ఉన్న రోగులకు, వృద్ధులకి మాత్రం ఇక్కడ నరకం చూడాల్సిందే. దాదాపు అన్ని విభాగాల్లో వీల్ చైర్ల కొరత కనిపిస్తుంది. అక్కడక్కడ ఒకటి రెండు ఉన్న వాటికోసం సిబ్బంది, రోగి బంధువులు పోట్లాడుకోవాల్సిన పరిస్థితి.

ఇంత ఇబ్బంది ఉన్న నిమ్స్ యాజమాన్యం మాత్రం ఈ సమస్య పై కన్నెత్తి చూడదు. ఇదిలా ఉంటే నిమ్స్ ఆసుపత్రికి ఎంతో మంది దాతలు, స్వచ్ఛంద సంస్థలు వందల సంఖ్యలో వీల్ చైర్లు ఉచితంగా అందచేస్తూ ఉంటారు. ప్రతి ఏటా వందల సంఖ్యలో వీల్ చైర్లు నిమ్స్‌కి అందుతూ ఉంటాయి. కానీ ఇవన్నీ ఎక్కడ పోతున్నాయో అర్థం కాని పరిస్థితి. వందల సంఖ్యలో వచ్చిన వీల్ చైర్లను ఎక్కడ పెడుతున్నారో ఎవరికీ అర్థం కాదు. కొన్ని మాత్రమే ప్రముఖులు వచ్చినప్పుడు వినియోగించడానికి దాచి పెడతారని తెలుస్తుంది. మరి మిగతావి ఎక్కడ ఉంటాయో తెలియదు. ఒక దిశలో కొందరు సిబ్బంది వైద్యులు అత్యవసరంగా అడుగుతారు. అన్న భయంతో ఒకటి రెండు చైర్లు ఎవరికీ కనిపించకుండా దాచుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఇప్పటికైనా అధికారుల రోగులకి ప్రాథమిక సౌకర్యమైన వీల్ చైర్లని ఓపితో పాటు అన్ని విభాగాల్లో అందుబాటులో ఉంచాలని, దాచి ఉంచిన వీల్ చైర్లను వినియోగంలోకి తీసుకురావాలని రోగులు కోరుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News