- Advertisement -
హ్యూస్టన్ : టైప్ 1 మధుమేహ రోగుల్లో నలభై ఏళ్లు పైబడినవారికి కరోనా సోకితే తీవ్ర అనారోగ్య ముప్పు ఎక్కువగా ఉంటుందని, పిల్లలు, యువతతో పోలిస్తే వీరు ఆస్పత్రిపాలు కావడానికి 7 రెట్లు అవకాశం ఉందని అమెరికా లోని కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడించింది. ఇటువంటి వారికి అక్యూట్ రెస్పిరేటరీ డిప్రెస్ సిండ్రోమ్‌తోపాటు మరణం ముప్పు ఎక్కువని అధ్యయనం వివరించింది. వీరిలో డయాబెటిక్ కిటోయాసిడోసిన్ లేదా తీవ్రస్థాయి హైపర్‌గ్లెసీమియా కూడా తలెత్తవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ఇలాంటివారిలో ఊబకాయం, అధికరక్తపోటు, లేదా హృద్రోగం, మూత్రపించాల వ్యాధి సమస్యలూ ఎక్కువేనని వివరించారు. దీన్ని బట్టి ఇలాంటివారికి ప్రత్యేక కొవిడ్ చికిత్సలు, టీకాలు అవసరమని చెప్పారు.
- Advertisement -