Wednesday, January 22, 2025

రోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు

- Advertisement -
- Advertisement -

జడ్చర్ల : వంద పడకల దవాఖానాను సందర్శించి రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి వైద్యులను ఆదేశించారు. సోమవారం పట్టణంలోని 100 పడకల దవాఖానాను సందర్శించి, ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు.

తెలంగాణ దశాబ్ది ఉ త్సవాల్లో భాగంగా ఆసుపత్రి ఐసియూ, డయాలసిస్ , మతా శి శు సంరక్షణ విభాగం, చిన్న పిల్లల వార్డు, అత్యవసర వార్డులను సందర్శించారు. రోగులను ఆప్యాయంగా పలకరించి వారికి ఇ బ్బందులు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల పరికరాలను అందుబాటులో ఉంచాలని, వైద్యాధికారులు, వైద్య శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

ఆసుపత్రిలో ఎంతో మంది రోగులను స్వయంగా పరిశీలించి చికిత్సలు చేశారు. దవాఖానా ఆవరణలో నీడ ఉండేలా షెడ్డును ని ర్మించాలని అధికారులను ఆదేశించారు. గర్భిణులకు నూట్రీషన్ కిట్లు, బాలింతలకు కెసిఆర్ కిట్లు  అందజేశారు. 24 గంటలు అందుబాటులో ఉండి సేవలు అం దించాలని వైద్యులకు, సిబ్బందికి సూచించారు.
పేదల ఆరోగ్యానికి సర్కారు భరోసా ….
అనారోగ్యం కారణంగా ప్రైవేట్ దావాఖానాల్లో చికిత్స పొందుతున్న పేదల ఆరోగ్యానికి తెలంగాణ సర్కార్ భరోసానిస్తుందని ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి అన్నారు. జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జడ్చర్ల పరిధిలో 25 మంది బాధితులకు రూ. 12.40 లక్షల విలువ చేసే సిఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి పంపిణీ చేశారు. గత ప్రభుత్వాలు మండలానికి ఒక సిఎంఆర్‌ఎఫ్ చెక్కు ఇచ్చిన పా పాన పోలేదని, నేడు వందల మందికి నిత్యం ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం నుంచి సాయం పొందిన వారు గ్రామాల్లో చర్చించాలని, పని చేసే ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కొ డ్గల్ యాదయ్య, మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రవీందర్, ముడా డైరెక్టర్లు శ్రీకాంత్, ఇంతియాజ్ అహ్మద్ ఖాన్ , కౌన్సిలర్లు, చైతన్య చౌహన్, సతీష్, లత , బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు నర్సిములు, ఇర్ఫాన్ , శివ దర్శన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News