లాన్సెట్ జర్నల్ అధ్యయనం వెల్లడి
లండన్ : గుండె పోటు, నొప్పి ఉన్న వారికి కొవిడ్ 19 సోకినట్టయితే రెండు వారాల్లో ఆ రిస్కు మూడింతలు పెరుగుతుందని లాన్సెట్ జర్నల్‌లో వెలువడిన అధ్యయనం వివరించింది. ఈ అధ్యయనం నిర్వహించిన స్వీడన్ లోని యుమియా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ఒస్వాల్డో ఫోన్సెకా రోడ్రిగుయెజ్ తమ అధ్యయనం గురించి వివరిస్తూ కొవిడ్ సోకిన 86,742 మంది గుండెపోటు రోగులను, నియంత్రిత వ్యక్తులు 3,48,481 మందితో పోల్చి పరిశీలించినట్టు చెప్పారు. 2020 ఫిబ్రవరి 1 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఈ అధ్యయనం సాగింది. తమ అధ్యయనంలో గుండె పోటున్న కొవిడ్ రోగుల్లో మూడింతలు రిస్కు పెరిగిందని తేలినట్టు చెప్పారు. ఈ రోగుల్లో గుండె కండరాల క్షీణత, రక్తపోటు, గుండె పోటు ఇవన్నీ కొవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్నట్టు వ్యక్తీకరిస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి కొవిడ్ రోగులకు ముఖ్యంగా వృద్ధులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి అని సూచిస్తున్నట్టు తెలియచేశారు. స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ, స్టాటిస్టిక్స్, నేషనల్ బోర్డు ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ నుంచి లభించిన డేటా తో తమ అధ్యయన ఫలితాలను తులనాత్మకంగా సమీక్షించ గలిగారు.
Patients with heart attack have three fold risk