Monday, April 21, 2025

హైడ్రా లాగా.. మేము కోబ్రా తీసుకొస్తాం: పట్లోళ్ల కార్తీక్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ నేతలపై బిఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి విమర్శలు చేశారు. ఆదివారం తెలంగాణ భవన్ లో రాజేంద్ర నగర్ ఇంచార్జ్ కార్తీక్ రెడ్డి అధ్యక్షతన అత్తాపూర్ డివిజన్ నుండి శ్రీరామ్ రెడ్డితోపాటు పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కెటిఆర్.. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటే హైవే రోడ్డు మీద పడ్డ మందు లారీ లెక్క అయిందని ఎద్దేవా చేశారు. ఎవరికి దొరికినంత వాళ్ళు దోచుకొని పోదాం అనే తప్ప.. పార్టీని బతికిద్దాం అని ఎవరికి లేదన్నారు. కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్ అసెట్ ప్రొటెక్షన్ అని హైడ్రా ఎలా తీసుకొచ్చారో.. మేము కాంగ్రెస్ వాళ్ళు కబ్జా చేసినవాటిని తిరిగి తీసుకు రాడానికి కోబ్రా అని తెస్తామని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News