పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలోని జయప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అమర్చినట్లు బూటకపు కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఫోన్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పాట్నా సీనియర్ ఎస్‌పి రాజీవ్ మిశ్రా కాల్‌చేసిన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎస్‌పి రాజీవ్ మిశ్రా తెలిపారు. విమానాశ్రయాన్ని తనిఖీ చేసినా అనుమానాస్పద వస్తువు ఏదీ కనిపించలేదు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఆపరేషన్ నిర్వహించామని ఎస్‌పి వెల్లడించారు. ఈ విషయంపై దర్యాప్తు కొనసాగుతోందని, విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టం చేశామన్నారు.
బుధవారం ఉదయం ల్యాండ్‌లైన్ నెంబర్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చిందని అధికారులు తెలిపారు. దీంతో మొత్తం టెర్మినల్ భవనం, పార్కింగ్ ఏరియా, కార్యాలయ భవనాన్ని బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఎటువంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని అధికారులు తెలిపారు. కాగా మద్యనిషేధం అమలులో ఉంది. సిఎం నితీశ్‌కుమార్ 5ఏప్రిల్ 2016న సంపూర్ణ మద్యనిషేధాన్నిప్రకటించారు.