Thursday, December 26, 2024

దేశంలో రెండో అత్యంత కలుషిత నగరం పాట్నా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో రెండో అతి పెద్ద కలుషిత నగరం పాట్నా. దీన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 316గా ఉంది. ఉత్తర్ ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా దేశంలో అత్యంత కలుషిత నగరంగా ఉంది. దాని ఏక్యూఐ 346గా ఉందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(సిపిసిబి) తన బులెటిన్ లో పేర్కొంది.

గాలి నాణ్యత బాగా దిగజారిందన్నది నిజమేనని బీహార్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్ఢ్ చైర్మన్ దేవేంద్ర కుమార్ శుక్లా పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. పాట్నా నగరంలో ఏక్యూఐ మరింత దిగజారకుండా ఉండేందుకు సివిక్ బాడీస్ నీళ్లను చిమ్ముతున్నాయని కూడా ఆయన తెలిపారు. వానాలు త్వరలో కొంత రిలీఫ్ తీసుకొస్తాయన్న ఆశాభావాన్ని కూడా దేవేంద్ర కుమార్ శుక్లా వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News