Sunday, December 22, 2024

బీహార్ లో బిసి, ఈబిసి, ఎస్సీ, ఎస్టీ 65 శాతం రిజర్వేషన్లు కొట్టేసిన హైకోర్టు

- Advertisement -
- Advertisement -

పాట్నా:  బీహార్ లో బిసి, ఈబిసి, ఎస్సీ, ఎస్టీలకు 65 శాతం రిజర్వేషన్ల కోటాను పాట్నా హైకోర్టు గురువారం కొట్టేసింది.

ఆర్టికల్స్ 14, 15,16 కింద సమానత్వ క్లాజ్ కు విరుద్ధంగా ఉన్నందున బీహార్ రిజర్వేషన్ చట్టం2023 చట్టంను పక్కన పెట్టేసింది.

బీహార్ 2023లో తీసుకొచ్చిన శాసనం బిసి, ఈబిసి, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ కోటాను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచేందుకు ఉద్దేశించింది. ఈ చట్టంతో బీహార్లో రిజర్వేషన్లు మొత్తం 75 శాతానికి చేరుకుంటాయి. దీంతో రిజర్వేషన్లు ఇచ్చే అతి పెద్ద రాష్ట్రంగా బీహార్ అయ్యేది. కానీ కోర్టు ఈ చట్టం ప్రతిపాదనను ఆమోదించలేదు.

ప్రస్తుతానికి రిజర్వేషన్ల కోటా పరిమితి 50 శాతం మేరకే ఉంది. దానికి మించి రిజర్వేషన్లు కల్పించే చట్టాలను కోర్టులు తిరస్కరిస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News