Sunday, December 22, 2024

బీహార్‌లో కుల సర్వేపై మధ్యంతర స్టే ఇచ్చిన పాట్నా హైకోర్టు!

- Advertisement -
- Advertisement -

పాట్నా: బీహార్‌లో కులాలు, ఆర్థిక స్తోమతను పరిశీలించే సర్వేపై గురువారం పాట్నా హైకోర్టు మధ్యంతర స్టే ఇచ్చింది. పాట్నా హైకోర్టు బుధవారం విచారణను పూర్తి చేసి, బీహార్‌లో కులాల గణన, ఆర్థిక సర్వేపై మధ్యంతర స్టే విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది.

నిన్నటి విచారణ సందర్భంగా అఖిలేశ్ కుమార్, తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి కె.వి. చంద్రన్‌తో కూడిని డివిజన్ బెంచ్ విచారించింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు దీను కుమార్, రీతూ రాజ్, అభినవ్ శ్రీవాస్తవ, రాష్ట్రం తరఫున అడ్వొకేట్ జనరల్ పికె. షాహీ న్యాయస్థానం ముందు వాదనలు వినిపించారు.

రాష్ట్ర ప్రభుత్వం కుల, ఆర్థిక సర్వేలు చేస్తోందని దీను కుమార్ కోర్టుకు తెలిపారు. సర్వేలు నిర్వహించే హక్కు రాష్ట్ర ప్రభుత్వ పరిధికి మించిందని అన్నారు. బుధవారం విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ పికె. షాహీ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించేందుకు, సామాజిక స్థాయిని మెరుగుపరిచేందుకు సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీహార్ ప్రభుత్వం జనవరి 7న కులాల సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News