Friday, November 22, 2024

‘మిషన్ 2024’ దిశగా మరో ముందడుగు

- Advertisement -
- Advertisement -

పాట్నా: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ను ఎదుర్కొనేందుకు వ్యూహ రచనను రూపొందించేందుకు ప్రతిపక్షాలు శుక్రవారం ఇక్కడ సమావేశం కానున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాఃధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సిఎం హేమంత్ సోరేన్, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, హమారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ , తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్ సహా పలువురు ప్రతిపక్ష నేతలు హాజరు కావచ్చని భావిస్తున్నారు.

Also Read: కాంగ్రెస్‌కు కేజ్రీవాల్ అల్టిమేటం

అయితే తాను ఈ సమావేశానికి హాజరు కావడం లేదని యుపి మాజీ ముఖ్యమంత్రి, బిఎస్‌పి అధినేత్రి మాయావతి ట్విట్టర్ వేదికగా ప్రకటించగా, ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో కేంద్రం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ వ్యతిరేకించాలని, లేదంటే ఈ సమావేశానికి హాజరు కాబోమని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అల్టిమేటం జారీ చేశారు. ఈ ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు తనవైఖరిని స్పష్టం చేయలేదు. పార్టీ నేతలతో చర్చించిన తర్వాత దీనిపై తమ వైఖరిని తెలియజేస్తామని గతంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొనడం గమనార్హం. కాగా నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపిని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ ఒక్క తాటిపైకి రావడానికి ఇది ఒక ప్రారంభం మాత్రమేనని సంబంధిత వర్గాలు తెలిపాయి.

అందువల్ల నాయకత్వ సమస్య, సీట్ల పంపిణీ లాంటి అంశాలు ప్రస్తుత సమావేశంలో చర్చకు రాకపోవచ్చని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ ప్రతిపక్ష నేత చెప్పారు. బిజెని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా ఉద్యమించే అంశాలు ముఖ్యంగా మణిపూర్‌లో హింస, ప్రభుత్వ వైఫల్యం లాంటి అంశాలు చర్చకు రావచ్చని ఆ నేత చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News