Sunday, December 22, 2024

పట్నా పైరేట్స్ హ్యాట్రిక్ విజయం

- Advertisement -
- Advertisement -

ప్రొ కబడ్డీ సీజన్ 11లో పట్నా పైరేట్స్ వరుసగా మూడో విజయం సాధించింది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పట్నా 42-37 పాయింట్ల తేడాతో యూపి యోధా టీమ్‌పై జయకేతనం ఎగుర వేసింది. ఆరంభం నుంచే పట్నా ఆధిపత్యం చెలాయించింది. యూపి కూడా గట్టి పోటీ ఇచ్చినా విజయం మాత్రం సాధించలేక పోయింది. అద్భుత ఆటను కనబరిచిన పట్నా ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. దూకుడైన ఆటను కనబరిచిన పట్నా ఈ సీజన్‌లో హ్యాట్రిక్ విజయం అందుకుంది. దేవాంక్, అయాన్ పట్నా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక యూపి ఈ సీజన్‌లో మూడో ఓటమిని చవిచూసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News