Monday, December 23, 2024

రైల్వే స్టేషన్ టీవీలలో పోర్న్ వీడియో ప్రత్యక్షం: ప్రయాణికులు షాక్(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

 

న్యూస్ డెస్క్: ప్రయాణికులతో కిటకిటలాడే ప్లాట్‌పారాల మీద రైళ్ల రాకపోకల వివరాలు..వాణిజ్య ప్రకటనలు మాత్రమే దర్శనమిచ్చే టీవీలలో హఠాత్తుగా పోర్న్ వీడియో ప్రత్యక్షమైతే పరిస్థితేంటి..అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితిని బీహార్‌లోని పాట్నా రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ఎదుర్కున్నారు. అది కూడా దాదాపు 3 నిమిషాల పాటు ఈ నీలి వీడియో అన్ని ప్లాట్‌ఫారాల మీది ట్రీవీలలో ప్రత్యక్షమైంది. ఆదివారం రాత్రి ఈ దారుణ సంఘటన జరిగింది.

దానాపూర్ డివిజన్‌లోని అన్ని రైల్వే స్టేషన్లలో వీడియోలు, సినిమాలను ప్రసారం చేసే కాంట్రాక్టును ఒక ప్రైవేట్ కంపెనీకి రైల్వే అధికారులు అప్పగించారు. పాట్నా స్టేషన్‌లోని అన్ని టీవీలలో నీలి వీడియో ప్రత్యక్షం కావడాన్ని చూసిన రైల్వే భద్రతా దళం(ఆర్‌పిఎఫ్) అధికారులు వెంటనే ఆకంపెనీ సిబ్బందినిసంప్రదించి ఆ వీడియోను నిలిపివేయాల్సిందిగా ఆదేశించారు. ఈ సంఘటన జరిగిన మాట వాస్తవమేనని దానాపూర్ డిఆర్‌ఎం కార్యాలయంలోని అధికార ప్రతినిధి ప్రభాత్ కుమార్ ధ్రువీకరించారు.

ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని,  దత్తా కమ్యునికేషన్ అనే ప్రైవేటు సంస్థకు ఇచ్చిన ఇంట్రాక్టును రద్దు చేసే ప్రక్రియను చేపట్టామని ఆయన తెలిపారు. కంపెనీ అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. ఇది సహించరాని సంఘటనని, ఆ కంపెనీని బ్లాక్‌లిస్టులో వేస్తామని ఆయన చెప్పారు. కాగా..ఆదివారం ఉదయం కూడా ఇటువంటి సంఘటనే పాట్నా రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్నట్లు వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News