Wednesday, January 22, 2025

నేను చెరువు భూమిని ఆక్రమించి ఇల్లు నిర్మించలేదు: పట్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తాను ఎలాంటి చెరువు భూమిని ఆక్రమించి ఇల్లు నిర్మించలేదని ఎంఎల్‌సి పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తాము గెస్ట్ హౌస్ నిర్మించుకున్నామన్నారు. హిమాయత్ సాగర్‌లోని గెస్ట్ హౌస్‌పై పట్నం వివరణ ఇచ్చారు.  నిబంధనల ప్రకారం లేదని తేలితే తాను కూల్చివేస్తానని పేర్కొన్నారు. చెరువుల్లో ఆక్రమణల కూల్చివేతను తాను సమర్థిస్తున్నానని పట్నం స్పష్టం చేశారు. 111 జిఒ పరిధిలో చాలా మంది నిర్మాణాలు చేసుకున్నారని, 111 జిఒ పరిధిలో మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని తెలియజేశారు. తన గెస్ట్ హౌస్ ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్‌లో ఉంటే కూల్చేయమని చెబుతున్నానన్నారు. ప్రభుత్వం అనుమతి ఇస్తేనే తాను నిర్మించుకున్నానని పట్నం వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News