Thursday, December 26, 2024

పట్నం పిటిషన్ పై ముగిసిన విచారణ…తీర్పు రిజర్వ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లగచర్ల దాడి ఘటనలో బొమ్రాన్ పేట్ పోలీసులు మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఒకే ఘటనపై వేర్వేరు కేసులు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ బిఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎంఎల్ఏ పట్నం నరేందర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సోమవారం(నవంబర్ 25న) హైకోర్టు విచారణ జరిపింది.

లగచర్ల ఘటనలో మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసిన విషయాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఒకే ఘటనపై వేర్వేరు కేసులు పెట్టవద్దన్న సుప్రీంకోర్టు తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించారు.ఇరువైపుల వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని లగచర్లలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపూ గ్రామస్థులు దాడి చేశారు. ఈ కేసులో మాజీ ఎంఎల్ఏ పట్నం నరేందర్ రెడ్డిని ఏ1గా, బిఆర్ఎస్ కార్యకర్త భోగమోని సురేశ్ ను ఏ2గా నిందితులుగా  చేర్చారు. ఈ కేసులో అరెస్టయిన పట్నం నరేందర్ రెడ్డి జ్యడీషియల్ రిమాండ్ లో భాగంగా ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News