Sunday, January 19, 2025

హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డికి ఊరట..

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి జరిగిన ఘటనలో అరెస్ట్ అయి చర్లపల్లి జైలులో ఉన్న నరేందర్ రెడ్డి తనకు ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని వేసిన పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. తోటి ఖైదీలతో కాకుండా పట్నం నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని హైకోర్టు పోలీసుల అధికారులకు ఆదేశించింది. ఆయనకు ఇంటి భోజనం అనుమతించాలని హైకోర్టు తెలిపింది. కాగా, కలెక్టర్ పై దాడికి పాల్పడే విధంగా పట్నం నరేందర్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టడమే కాకుండా.. దాడికి కుట్ర చేశారని పోలీసులు ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News