Monday, February 10, 2025

లగచర్ల కేసులో పట్నం నరేందర్‌రెడ్డికి రిమాండ్ పొడిగింపు

- Advertisement -
- Advertisement -

లగచర్ల కేసు లో ఏ1 నిందితుడిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ ను కోర్టు పొడిగించింది. బుధవారంతో పట్నం నరేందర్ రిమాండ్ గడువు ముగియగా పోలీసులు కొడంగల్ కోర్టులో హాజరు పరిచారు. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్‌ను డిసెంబర్ 11 వరకూ పొడిగిస్తూ జూనియర్ సివిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 11న లగచర్లలో ఇండస్ట్రియల్ కారిడార్ భూ సేకరణపై రైతుల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ పై అక్కడి రైతులు, ప్రజలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మాజీ ఎంఎల్‌ఎ నరేందర్ రెడ్డి హస్తం ఉందని ఆరోపణలు రాగా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి కొడంగల్ మెజిస్ట్రేట్ లో హాజరు పరిచారు. 14 రోజుల రిమాండ్ విధించిన విషయం విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News