లగచర్ల ఘటనలో పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ గురువారం నమోదైంది. సుప్రీంకోర్టు మార్గదర్శ కాలకు విరుద్ధంగా తన భర్త పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారని సతీమణి పట్నం శృతి పిటిషన్ ధాఖలు చేశారు. దీనిపై పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని పట్నం శృతి పిటిషన్‌లో పేర్కొన్నారు. ఒక వ్యక్తిని అరెస్టు చేసే సమయంలో అనుసరించాల్సిన నిబంధనలు పాటిం చలేదని పేర్కొన్నారు. డి.కె.బసు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును శృతి పిటిషన్‌లో వెల్లడించారు. ప్రతివాదులుగా ఐజి వి. సత్యనారాయణ, వికారాబాద్ ఎస్‌పి కె. నారాయణరెడ్డి, బొమ్మరాస్పేట ఇన్‌స్పెక్టర్ శ్రీధర్రెడ్డి, ఎస్‌ఐ మహమ్మద్ అబ్దుల్ రవూఫ్ చేర్చారు. పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ పట్నం శృతి కోరారు. మరి దీనిపై హైకోర్టు ఎలా స్పందిస్తుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
లగచర్ల ఘటనపై పట్నం మహేందర్ రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్న విషయం తెలిసిందే. లగచర్లలో భూసేకరణకు సంబంధించిన విచారణకు వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై దాడికి పాల్పడిన ఘటనలో ఎ1గా ఉన్న మాజీ ఎంఎల్‌ఎ పట్నం నరేందర్ రెడ్డి కీలక పోషించారని పోలీసులు అదుపులో తీసు కున్నట్లు వెల్లడించారు. ఎ-2గా ఉన్న సురేశ్ ఇతర నిందితులను నైతికంగా సహకరించారనే ఆరోపణలున్నాయి. అయితే సురేష్ తో దాదాపు 89 సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడారని తెలిపారు. ఈ ఘటన తరువాత నుండి సురేష్ పరారీలో ఉండగా, పోలీసులు అతడి కోసం ముమ్మరంగా గాలిం చారు. తాజాగా సురేష్ స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోవడం గమనార్హం. సురేష్ లొంగిపోవడంతో లగచర్ల ఘటనపై తదుపరి పరిణామా లపై ఆసక్తి నెలకొంది. పోలీసులు ఆరోపించినట్లుగా సురేష్ ఎవరి పేర్లు బయటపెడతాడు అన్న ఉత్కంఠ నెలకొంది.